ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు
- హుటాహుటిన నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలింపు
- రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో వెల్లడి
- మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించే యోచన
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనను వెంటనే నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షించి, గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం మేకపాటికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆయన గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో బయటపడినట్లు తెలిసింది.
యాంజియో పరీక్ష పూర్తయిందని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మేకపాటి ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.