తెలంగాణ కుర్రకారులో పెరిగిపోతున్న కేన్సర్ కేసులు
- 30 ఏళ్లలోపు వారిలో వెలుగు చూస్తున్న కొలరెక్టల్ కేన్సర్ కేసులు
- జీనవశైలి, ఆహార, చెడు అలవాట్లతో మరింత రిస్క్
- ఏటా 3,500 కొత్త కేసులు
- మొత్తం కేన్సర్ కేసుల్లో 10% 30 ఏళ్లలోపులోనే
తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా యువతలో ఎక్కువగా కొలరెక్టల్ కేన్సర్ (పెద్ద పేగు) కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 30 ఏళ్లలోపు వారిలో కేన్సర్ అడ్వాన్స్ డ్ (ముదిరిన) దశలో ఉండడాన్ని చూసి వైద్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చే కొలరెక్టల్ కేన్సర్ కేసుల్లో 30 శాతం 30 ఏళ్లలోపు వారిలోనే ఉంటున్నాయి. ఇటీవలి వరకు తెలంగాణ కేన్సర్ కేసుల్లో కొలరెక్టల్ కేన్సర్ కేసులు ఒక శాతం మేర ఉంటే, ఇప్పుడవి 6.7 శాతానికి పెరిగాయి. ఏటా 3,500 కేసులు వెలుగు చూస్తున్నాయి.
గడిచిన ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 10,000 కొలరెక్టల్ కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఆరంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ముందే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక బ్రెస్ట్ కేన్సర్, సర్విక్స్ కేన్సర్, ఓరల్ కేన్సర్ తెలంగాణలోని కేన్సర్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న మొదటి మూడు కేన్సర్లుగా ఉన్నాయి. లంగ్ కేన్సర్, స్టొమక్ కేన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి.
కొన్నేళ్ల క్రితం కేన్సర్ కేసులు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించేవి. కానీ, ఇప్పుడు చిన్న వయసులోనూ ఈ మహమ్మారి మనుషులపై దాడి చేస్తోంది. ప్రస్తుతం మొత్తం కేన్సర్ కేసుల్లో 30 ఏళ్లలోపు వారివి 10 శాతంగా ఉంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఆహారం జీవనశైలి అలవాట్లను దీనికి కారణంగా చెబుతున్నారు. వేపుళ్లు, నూనెలు, కార్సినోజెనిక్ ఆహార పదార్థాలను బయట తినడంతోపాటు.. కూరగాయల సాగులో వాడుతున్న పురుగు మందులు కూడా హానికారక ప్రభావానికి దారితీస్తున్నట్టు తెలియజేస్తున్నారు. చీజీ, క్యాన్డ్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులతోనూ రిస్క్ పెరుగుతున్నట్టు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ అలవాట్లకు తోడు మద్యపానం, పొగతాగడం కొలరెక్టల్, స్టొమక్ కేన్సర్లకు దారితీస్తున్నట్టు చెబుతున్నారు. లంగ్ కేన్సర్ కేసులు సైతం 7 శాతానికి చేరి, ఏటా 3,500 కొత్త కేసులుగా ఉంటున్నాయి.