పటాన్ చెరు ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం
- ఓవైపు ఆర్పుతుంటే మరోవైపు ఎగసిపడుతున్న మంటలు
- పలువురు కార్మికులకు గాయాలు
- ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందన్న వైద్యులు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు లియో ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడుతున్న మంటలు కంపెనీ మెుత్తం వ్యాపించాయి. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీయగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను అధికారులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఇందులో ఇద్దరు కార్మికుల ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పారు.
అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ పరిసరాల్లో పొగ దట్టంగా అలముకుంది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు మంటలు ఎగసిపడ్డాయి. కంపెనీలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన కెమికల్ వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా మంటల్లో గాయపడిన ఉద్యోగుల వివరాలు తెలియాల్సి ఉంది.