లోకేశ్ కు షేక్ హ్యాండిచ్చిన డ్రైవర్ కు ఉద్వాసన అంటూ ప్రచారం.. ఖండించిన ఏపీఎస్ ఆర్టీసీ!
- యువగళం యాత్ర సందర్భంగా లోకేశ్ తో డ్రైవర్ కరచాలనం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- ఆ డ్రైవర్ ను ఆర్టీసీ తొలగించిందంటూ ప్రచారం
- అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఆయనతో షేక్ హ్యాండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ పై ఏపీఎస్ ఆర్టీసీ కక్షసాధింపుకు దిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నారా లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్ ను ఉన్నతాధికారులు తొలగించారని ప్రచారం ఊపందుకుంది. లోకేశ్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేయడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించామనడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో పాదయాత్రగా సాగుతున్న నారా లోకేశ్ కు ఆర్టీసీ బస్ ఎదురైంది. అందులో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు లోకేశ్ తో కరచాలనం చేశారు. డ్రైవర్ షేక్ హ్యాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ డ్రైవర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారని ప్రచారం మొదలైంది. తనకు మద్దతు తెలిపినందుకు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని నారా లోకేశ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ డ్రైవర్ ను నిజంగానే విధుల నుంచి తొలగించారా? అంటూ కొంతమంది నెటిజన్లు ఏపీఎస్ ఆర్టీసీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీంతో ఆర్టీసీ స్పందించింది. ఇది తప్పుడు వార్త అంటూ ఖండించింది.