అకౌంట్లో ప్రభుత్వం డబ్బులేయగానే వివాహితలు తమ ప్రియుళ్లతో జంప్.. భర్తలకు భారీ షాక్

  • భర్తలకు భారీ షాకిచ్చిన ఐదుగురు మహిళలు
  • ప్రభుత్వ తొలి విడత ఆర్థికసాయం అందగానే ప్రియుళ్లతో పరార్
  • వారికి మలి విడత డబ్బు ఇవ్వొద్దంటూ ప్రభుత్వానికి బాధిత భర్తల విజ్ఞప్తి
కేంద్ర ప్రభుత్వం సాయం అందీఅందగానే ఐదుగురు వివాహితలు తమ భర్తలకు భారీ షాకిచ్చారు. డబ్బు అకౌంట్లో పడ్డాక ప్రియుళ్లను తీసుకుని పారిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాల్లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది. తమ భార్యలు చేసిన పని తెలుసుకుని బాధిత భర్తలు లబోదిబోమంటున్నారు. 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం.. భూమి ఉన్న నిరుపేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలిసిందే. బారాబంకీ జిల్లా నుంచి ఈ పథకం కింద మొత్తం 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. తొలి విడతగా ఇటీవల వారి అకౌంట్లలో రూ.50 వేలు జమ చేశారు. ఇలా డబ్బు అకౌంట్లలో పడగానే వివాహితలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పారిపోయారు. దీంతో..వారికి రెండో విడత సాయం ఇవ్వొద్దంటూ బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News