నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 220 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా పతనమైన టాటా స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించి నష్టాల్లో ముగిశాయి.
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 60,286కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 17,721 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.59%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.22%), బజాజ్ ఫైనాన్స్ (0.90%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.61%), ఎల్ అండ్ టీ (0.51%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.23%), ఐటీసీ (-2.65%), సన్ ఫార్మా (-1.74%), మారుతి (-1.72%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.59%).