సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారనే వారికి ఇదే సమాధానం: నాగబాబు

  • సినిమాలు కేవలం వినోదం కోసమేనని వెల్లడి
  • సినిమాలు ఓ బిజినెస్ మాత్రమేనని వివరణ
  • సినిమాల్లో ఏదైనా అతిగా ఉంటే సెన్సార్ బోర్డు చూసుకుంటుందని వ్యాఖ్యలు
సినిమాలు-సమాజం అనే అంశంపై టాలీవుడ్ నటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో చూపించే హింస వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే, సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా? అని ప్రశ్నించారు. 

ఓ ఫిలింమేకర్ గా తన దృష్టిలో ఒకటి మాత్రం నిజం అని, సినిమాలు అనేవి ఎంటర్టయిన్ మెంట్ కోసమేనని వెల్లడించారు. జనాన్ని బాగుచేయడం కోసమో, చెడగొట్టడం కోసమో సినిమాలు చేసేంత గొప్పవాళ్లు లేరిక్కడ అని నాగబాబు వ్యాఖ్యానించారు. సినిమా అనేది కేవలం ఓ బిజినెస్ అని స్పష్టం చేశారు. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇదే సమాధానం అని స్పష్టం చేశారు.

సినిమాల్లో ఏదైనా అతిగా ఉంటే, ఆ విషయం చూసుకోవడానికి సెన్సార్ బోర్డు ఉందని తెలిపారు. కుహనా మేధావులూ ఏడవకండి అని నాగబాబు హితవు పలికారు.


More Telugu News