ఈ నాలుగు లక్షణాలతో మీ లివర్ పరిస్థితి ఎలా ఉందో చెప్పేయొచ్చు!
- శరీర ఆరోగ్యానికి అత్యంత కీలకం కాలేయం
- కాలేయానికి ఫ్యాటీ లివర్ సమస్య
- మద్యం తాగని వారిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్
- జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే డిసీజ్
మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి... కాలేయం. ఇది ఏమాత్రం దెబ్బతిన్నా దాని ప్రభావం శరీరంలోని అన్ని భాగాలపై పడుతుంది. శరీరంలో కొవ్వులను కరిగించడంలోనూ, వ్యాధులపై పోరాడాలన్నా లివర్ దే ప్రధాన పాత్ర. రక్తాన్ని శుద్ధి చేస్తూ, రక్తంలో హానికర పదార్థాలను అదుపులో ఉంచుతుంది. రక్తంలోని పోషకాలను శరీరానికి అందేలా చేయడం లివర్ ముఖ్యవిధుల్లో ఒకటి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లివర్ కు జబ్బు చేస్తే అది ప్రాణాంతకం అవుతుంది.
కాలేయానికి సోకే వ్యాధుల్లో ప్రధానమైనది ఫ్యాటీ లివర్. సహజంగా మద్యం తాగేవారిలో కాలేయానికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే మద్యం తాగనివారిలోనూ ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమవుతుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్ డీ) అంటారు. కాలేయంలో ప్రమాదకరరీతిలో కొవ్వు పేరుకుపోతుంది. దాంతో లివర్ పనితీరు మందగించి, ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే, ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను జీర్ణ వ్యవస్థలో కలిగే 4 మార్పుల ద్వారా గుర్తించవచ్చు.
1. కడుపు ఉబ్బరం...
తరచుగా కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్టయితే ఫ్యాటీ లివర్ లక్షణంగా అనుమానించాల్సి ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడేవారిలో 49.5 శాతం మందిలో కడుపు ఉబ్బరం కనిపించినట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉదర కుహరాల్లో భారీగా ద్రవ పదార్థాలు చేరడం వల్ల కడుపు ఉబ్బరించినట్టుగా కనిపిస్తుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే, కడుపులో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోయి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
2. కడుపు నొప్పి...
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బాధితుల్లో కొందరికి పొత్తికడుపు పైభాగంలో నొప్పిగా ఉంటుంది. ఇది ఫలానా నొప్పి అని స్పష్టంగా చెప్పలేని విధంగా ఉంటుంది. కడుపు నొప్పి సాధారణ సమస్యే అయినా, ఫ్యాటీ లివర్ బాధితుల్లో కడుపు నొప్పితో పాటు వికారం, ఆకలి మందగించడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
3. అజీర్తి...
2014లో చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం... ఈ తరహా ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడేవారిలో అజీర్తి కూడా కనిపిస్తుంది. తిన్నది అరగకపోగా, గ్యాస్ట్రో ఐసోఫేగల్ రిఫ్లక్స్ లక్షణాలు మరింత పెరిగేందుకు దోహదపడుతుంది. గుండెల్లో మంట, జీర్ణరసాలు పైకి ఎగదన్నడం, తిన్న ఆహారం ఏమాత్రం జీర్ణం కాకుండా తిరిగి త్రేపుల రూపంలో గొంతులోకి వస్తుండడం వంటి లక్షణాలతో బాధపడతారు.
4. బలహీన జీర్ణ వ్యవస్థ...
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వ్యాధిగ్రస్తుల్లో జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. కాలేయంలో తయారయ్యే పైత్య రసం ఆహారం జీర్ణం అయ్యేందుకు తోడ్పడుతుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది, కాలేయం అనారోగ్యంతో ఉంటే పైత్యరసం ఉత్పత్తి కుంటుపడుతుంది. మనం కొద్దిగా ఆహారం తీసుకున్నా గానీ, పొత్తికడుపు కుడివైపున భాగంలో పూర్తిగా నిండిపోయిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అంతేకాదు, మలవిసర్జన సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు సకాలంలో డాక్టర్లను సంప్రదించకపోతే, అది పోషకాహార లోపానికి దారితీయడమే కాదు, గ్యాస్ట్రిక్ రక్తస్త్రావం వంటి తీవ్ర సమస్యలు కలిగిస్తుంది.