లోకేశ్ పాదయాత్రకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది: చినరాజప్ప
- జనవరి 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభం
- యువగళం పాదయాత్రకు నేటికి 11వ రోజు
- జగన్ కు ఓటమి భయంతో చెమటలు పడుతున్నాయన్న చినరాజప్ప
- పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్ర నేడు 11వ రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు.
లోకేశ్ పాదయాత్రకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడించారు. జగన్ కు ఓటమి భయంతో చెమటలు పడుతున్నాయని అన్నారు. అందుకే, లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. విధులకు భంగం కలిగించారన్న ఆరోపణలతో కేసులు పెడుతున్నారని వివరించారు.
యువగళం పాదయాత్ర సజావుగా జరిగేలా చూడాలని డీజీపీని కోరుతున్నామని చినరాజప్ప తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.