ఇంటర్ చదివిన అదానీకి.. వేల కోట్లు ఎలా ఇచ్చారు?: కాంగ్రెస్ నేత చింతా మోహన్

  • రూ.30 వేల కోట్ల రుణాన్ని మోదీ స్నేహితుడు అదానీకి ఎస్‌బీఐ కట్టబెట్టిందన్న చింతా మోహన్
  • 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని వ్యాఖ్య
  • ఎస్‌బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చండంటూ ఎద్దేవా
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం
ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి వేల కోట్ల రుణాన్ని ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఇచ్చారని.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్‌బీఐ ముందు సోమవారం ఉదయం ఆయన నిరసనకు దిగారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

రూ.30 వేల కోట్ల రుణాన్ని మోదీ స్నేహితుడు అదానీకి రాజకీయ పలుకుబడితో ఎస్‌బీఐ కట్టబెట్టిందని ఆరోపించారు. దేశంలోని 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని చెప్పారు. ఎస్‌బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చండంటూ ఎద్దేవా చేశారు. ఎల్ఐసీని కూడా అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా మార్చాలన్నారు. 

మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లు మాత్రమే వస్తాయని చింతా మోహన్ జోస్యం చెప్పారు. బటన్ నొక్కినంత మాత్రాన జగన్‌ను ప్రజలు నమ్మరని అన్నారు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. వైసీపీలో ఉండలేక ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారని తెలిపారు.


More Telugu News