ఈ సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పటికీ బ్రహ్మానందం సలహానే పాటిస్తున్నాడట!
- నాటకరంగం నుంచి వచ్చిన సుబ్బరాయశర్మ
- జంధ్యాల .. దాసరి ప్రోత్సహించారని వెల్లడి
- ఒక వైపున ఉద్యోగం .. మరో వైపున నటన సాగిందని వివరణ
- తనకి చాలా కోపం ఉండేదంటూ ఆనాటి సంగతుల ప్రస్తావన
తెలుగు తెరకి నాటక రంగం నుంచి వచ్చిన నటులలో సుబ్బరాయశర్మ ఒకరు. ఒక వైపున నాటకాలు .. మరో వైపున టీవీ సీరియల్స్ .. ఇంకో వైపున సినిమాలు చేసుకుంటూ వెళ్లినవారాయన. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
జంధ్యాల గారు నాటక రంగం నుంచి వచ్చారు గనుక, రంగస్థలానికి చెందిన చాలామంది కళాకారులను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ తరువాత దాసరి నారాయణరావుగారు కూడా రంగస్థల కళాకారులకు ఎక్కువగా అవకాశాలనిస్తూ వెళ్లారు. అందువలన నాలాంటి వాళ్లు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
నేను ఆర్టీసీలో పనిచేస్తూ అవకాశాన్ని బట్టి నటన వైపు వెళుతూ ఉండేవాడిని. అప్పట్లో నాకు చాలా కోపం ఎక్కువ. ఎవరు ఏమన్నా వెంటనే కోపం వచ్చేసేది. ఆ విషయాన్ని బ్రహ్మానందం గారు గమనించారు. "నీ స్వభావానికీ .. సినిమా ఇండస్ట్రీకి అస్సలు కలవదు. అందువలన ఇక్కడ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ .. ఇక్కడ నుంచి అవకాశాలు వస్తే చేయి .. లేదంటే లేదు" అన్నారు. అప్పటి నుంచి ఆయన సలహాని పాటిస్తూ వచ్చాను అని చెప్పుకొచ్చారు.