ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? చెక్ చేసుకోవచ్చు ఇలా..!
- మార్చి 31లోగా అనుసంధానించుకోవాలి
- లేదంటే పాన్ డీయాక్టివేట్ అయిపోతుంది
- ఆన్ లైన్ లోనే సులభంగా స్టేటస్ తెలుసుకోవచ్చు
ఆధార్ తో పాన్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. అయినా ఇప్పటికీ చాలా మంది ఇంకా అనుసంధానించుకోలేదు. ఇప్పటి వరకు వ్యక్తులకు సంబంధించి 61 కోట్ల పాన్ లు విడుదల చేయగా.. కేవలం 48 కోట్ల మంది అనుసంధానించుకున్నారు. అంటే ఇంకా 13 కోట్ల మంది ఆధార్ తో లింక్ చేసుకోలేదని తెలుస్తోంది.
ఆధార్-పాన్ అనుసంధానం పూర్తిగా ఉచితమే అయినా, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు రూ.1,000 చెల్లించి మార్చి 31 వరకు లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్-పాన్ అనుసంధానించుకోకపోతే మార్చి 31 తర్వాతి రోజు నుంచి పాన్ డీయాక్టివేట్ అయిపోతుంది. దీంతో పెట్టుబడులు, ముఖ్య ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి వీలు పడదు. పన్ను రిటర్నులు కూడా దాఖలు చేయలేరు. మిగిలిన వారు కూడా మార్చి 31లోపు లింక్ చేసుకోవాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి కోరుతోంది.
ఆదాయపన్ను శాఖ పోర్టల్ కు వెళ్లి ఆధార్-పాన్ నంబర్ అనుసంధానించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే లింక్ చేసుకున్నదీ, లేనిది తనిఖీ చేసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ లో ఎడమ చేతి వైపు లింక్ ఆధార్ స్టేటస్, లింక్ ఆధార్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని సెలక్ట్ చేసుకుని ముందుకు వెళ్లాలి. అలాగే, https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar పోర్టల్ కు వెళ్లి పాన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాపెచా ఇస్తే అనుసంధానం గురించి సమాచారం తెలియజేస్తుంది.