రైతులకు తెలంగాణ సర్కారు తీపి కబురు.. రుణమాఫీకి రూ. 6 వేల కోట్ల కేటాయింపు

  • రుణమాఫీ కోసం బడ్జెట్ లో రూ. 6,385 కోట్లు
  • రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
  • ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపు మూడు లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో రైతులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతు రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 

వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ. 26,931 కోట్లకు ఇది అదనం. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది.


More Telugu News