ఇప్పుడు అందరూ మాట్లాడుకునే పేరు .. అర్జున్ దాస్!

  • కార్తీ 'ఖైదీ' సినిమాతో అర్జున్ దాస్ కి గుర్తింపు 
  • 'మాస్టర్' సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన అర్జున్ దాస్ 
  • 'బుట్టబొమ్మ'తో టాలీవుడ్ కి మరింత దగ్గరైన నటుడు 
  • విలన్ వేషాలతో ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలం  
కొంతమంది నటులు తెరపైకి వస్తూనే ఆకట్టుకుంటారు. అందుకు కారణం వారిలోని ప్రత్యేకత. వారి నడక .. లుక్స్ .. సిగరెట్ వెలిగించే స్టయిల్ .. పాత్రలో నుంచి బయటికి రాకుండా ఆవిష్కరించే సహజత్వం కనిపిస్తుంటాయి. అందువలన సినిమా విడుదల తరువాత వాళ్లను గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న నటుడుగా అర్జున్ దాస్ కనిపిస్తున్నాడు. 

అర్జున్ దాస్ పదేళ్ల క్రితమే తమిళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆయన ఏ తరహా పాత్రకి సెట్ అవుతాడనేది తెలుసుకోవడానికీ .. తేల్చుకోవటానికి మేకర్స్ కి కొంత సమయం పట్టింది. అలా ఆయన కార్తి హీరోగా చేసిన 'ఖైదీ' సినిమాతో జనంలో దృష్టిలో పడ్డాడు. మెయిన్ విలన్ కి ప్రధానమైన అనుచరుడిగా ఆయన నటన ఆడియన్స్ ను కట్టిపడేసింది. 

ఇక విజయ్ 'మాస్టర్' సినిమాలో విజయ్ సేతుపతికి ప్రధానమైన అనుచరుడిగాను ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. తనదైన స్టయిల్.. బేస్ వాయిస్ తో ఆయన బాగా రిజిస్టర్ అయ్యాడు. కమల్ 'విక్రమ్' సినిమాలో కనిపించింది కాసేపే అయినా తనదైన మార్క్ చూపించాడు. ఇక రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన 'బుట్టబొమ్మ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. 

ఆయితే తెలుగులో ఇదే ఆయనకి ఫస్టు మూవీ కాదు .. ఇంతకుముందే గోపీచంద్ 'ఆక్సిజన్' లో చేశాడు, అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం వలన గుర్తింపు రాలేదు. 'బుట్టబొమ్మ' విషయానికే వస్తే అనిఖ సురేంద్రన్ తరువాత ప్లేస్ అర్జున్ దాస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. విలన్ గా ఎంట్రీ ఇచ్చి చివర్లో హీరో అనిపించుకునే పాత్ర అది. అర్జున్ దాస్ టాలీవుడ్ కి చేరువవుతున్న తీరు చూస్తుంటే, త్వరలోనే ఆయన ఇక్కడ విలన్ వేషాలతో బిజీ అవుతారనే అనిపిస్తోంది..


More Telugu News