లోకేశ్ పాదయాత్ర 10వ రోజున పలు ఆసక్తికర అంశాలు... వివరాలు ఇవిగో!
- కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
- జనవరి 27న ప్రారంభమైన యువగళం
- పూతలపట్టు నుంచి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు నేడు 10వ రోజు. ఇవాళ లోకేశ్ పూతలపట్టు నియోజకవర్గంలో 13.5 కిలోమీటర్లు నడిచారు. ఇవాళ్టి పాదయాత్రలో పూతలపట్టు నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది
ముఖ్యాంశాలు...
మారేడుపల్లిలో లోకేశ్ ప్రసంగం...
రాష్ట్రంలోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్... నీకు దమ్ముంటే చిత్తూరుజిల్లాకు పరదాలు, బారికేడ్లు రాకుండా రా... నేనిక్కడే ఉంటా... ప్రజలు నిన్ను ఆదరిస్తారో, నన్ను ఆదరిస్తారో తేలిపోతుంది. జగన్ పాలనలో యువత ఎక్కువగా నష్టపోయారు...ఎవరికీ ఉద్యోగాలివ్వలేదు. టీడీపీ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో చంద్రబాబు 40వేల ఫ్యాక్టరీలను తెచ్చారు. 6లక్షల ఉద్యోగాలిచ్చారు. ఈ విషయాన్ని దివంగత ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. జగన్ రెడ్డి పరిశ్రమలు తేకపోగా...రాష్ట్రంలో ఉన్న అమర్ రాజా, రిలయన్స్, జాకీ వంటి పెద్ద పెద్ద పరిశ్రమలను పక్కరాష్ట్రాలకు తరిమేస్తున్నాడు.
నా పాదయాత్రతో వైసీపీ గుండెల్లో రైళ్లు
నా పాదయాత్రతో టీడీపీకి ఉపయోగం లేదని హోంశాఖ మంత్రి తానేటి వనిత అంటున్నారు. అదే నిజమైతే మీ పోలీసులు నా వాహనాలు రెండింటిని ఎందుకు సీజ్ చేశారు. నా వాహనాలు వదిలేయండి. నా తమ్ముళ్లు, అక్క, చెల్లెమ్మలు, అవ్వ, తాతల నుంచి పెద్దఎత్తున పాదయాత్రకు రావడం చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోంది.
10 రోజుల నా పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అందుకే అడుగడుగునా పోలీసులను రెచ్చగొట్టి మాపై ఆంక్షలు విధించి వేధిస్తున్నారు. వైఎస్ఆర్, జగన్, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు మేం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు... కానీ నాకు 29ఆంక్షలు విధించారు. ఎందుకంత భయం? నాపై 17వ కేసు పెట్టారు... 175 కేసులు ఒకేసారి పెట్టుకో... ఆ కేసు కాగితాలు మడిచి పెట్టుకో.
తవణంపల్లిలో లోకేశ్ ప్రసంగం...
గుడివాడలో సన్నబియ్యం సన్నాసి తాగి ఒళ్లు తెలియకుండా వాగుతున్నాడు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిదని వాడిని హెచ్చరిస్తున్నా. లేకపోతే జనం చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అబద్దాలు చెప్పే సీఎంను అబద్దాలోడే అంటారు సన్నబియ్యం సన్నాసీ! ఎవరు ఏపీని అభివృద్ధి చేశారో... ఎవరు పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరిమారో చర్చిద్దాం రా.
టీడీపీ హయాంలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి అసెంబ్లీలో చెప్పారు. ఇక మీ తప్పుడు మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రతిపక్షనేతగా ఉన్నపుడు జగన్ పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ముఖ్యమంత్రికి ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా భయం. బాబాయిని చంపింది అబ్బాయేనని తేలిపోయింది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 11వ రోజు (6-02-2023) సోమవారం షెడ్యూల్ వివరాలు
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 మంగసముద్రంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 బీడీ కాలనీ, లెనిన్ నగర్, సంతపేటలో బీడీవర్కర్లతో భేటీ.
9.40 చిత్తూరు కోర్టు సర్కిల్ లో లాయర్లతో ముఖాముఖి.
10.05 గాంధీ సర్కిల్ వద్ద స్థానిక నాయకులతో మాటామంతి.
10.25 ఎంఎస్ఆర్ సర్కిల్ లో స్థానిక నాయకులతో మాటామంతి.
10.45 అంబేద్కర్ సర్కిల్ వద్ద ముస్లిం పెద్దలతో మాటామంతీ.
11.20 గ్రీమ్స్ పేటలో పార్టీ నాయకులతో మాటామంతీ.
12.10 అమర్ రాజా ప్రాంగణంలో పక్కనున్న టీడీడీ కళ్యాణమండపంలో మహిళలతో ముఖాముఖి.
12.55 అమర్ రాజా ప్రాంగణం పక్కనున్న టీడీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో భోజన విరామం.
1.55 పాదయాత్ర పునఃప్రారంభం.
సాయంత్రం
3.05 టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.
4.20 టీడీపీ కార్యాలయంలో యువతతో ముఖాముఖి.
5.20 కుంగరెడ్డిపల్లి కెఆర్ నగర్ కాలనీ విడిది కేంద్రంలో బస.
ముఖ్యాంశాలు...
- ప్రతిరోజు పాదయాత్రకు ముందు సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం నిర్వహిస్తున్న లోకేశ్
- తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో సెల్ఫీలు
- పాదయాత్ర 100 కిమీ పూర్తయిన సందర్భంగా లోకేశ్ తో భారీ కేకు కోయించిన మారేడుపల్లి యువకులు
- కాణిపాకంలో పూల తివాచీ పరిచిన గ్రామస్తులు. పువ్వులతో లోకేశ్ కు స్వాగతం.
- కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు
- లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ
- నడుస్తూ తూలిపడిపోయిన కొనకళ్ల... చేయందించి పైకి లేపి, ఆయన ప్యాంటుకు అంటిన మట్టిని తుడిచిన లోకేశ్
- రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసిందన్న లోకేశ్
- గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ పారామెడిక్స్ సేవలు వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి
- అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్యూనిటీ పారామెడిక్స్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ
- అధికారంలోకి వచ్చిన 3నెలల్లో ముస్లింలపై అక్రమకేసుల మాఫీ!
- దుల్హన్, మైనార్టీ కార్పొరేషన్, విదేశీ విద్యను మళ్లీ తీసుకొస్తామని వెల్లడి