ఎన్టీఆర్ లాంటివాడు మళ్లీ పుట్టడు: 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంటులో బ్రహ్మాజీ!
- కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్'
- మనిషిని పోలిన మనుషుల మధ్య జరిగే కథ
- హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ నెల 10వ తేదీన సినిమా రిలీజ్
కల్యాణ్ రామ్ హీరోగా 'అమిగోస్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ కథానాయికగా పరిచయమవుతోంది.
ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన బ్రహ్మాజీ మాట్లాడుతూ .. "ఇంతవరకూ చాలా కూల్ గా కనిపిస్తూ వచ్చిన కల్యాణ్ రామ్, ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపిస్తాడు. ఈ సినిమాలో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నాడు.
"డైరెక్టర్ రాజేంద్రరెడ్డి ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింటుతో వస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారనే కాన్సెప్టుతో ఈ సినిమా వస్తోంది. కానీ ఎన్టీఆర్ ను పోలిన మనిషంటూ ఎక్కడా ఉండడు .. అసలు అలాంటివాడు మళ్లీ పుట్టడు" అని చెప్పుకొచ్చాడు. స్టేజ్ పై మోకాళ్లపై కూర్చుని ఆయన చేసిన డాన్స్ అందరినీ నవ్వించింది. .
ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన బ్రహ్మాజీ మాట్లాడుతూ .. "ఇంతవరకూ చాలా కూల్ గా కనిపిస్తూ వచ్చిన కల్యాణ్ రామ్, ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపిస్తాడు. ఈ సినిమాలో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నాడు.
"డైరెక్టర్ రాజేంద్రరెడ్డి ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింటుతో వస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారనే కాన్సెప్టుతో ఈ సినిమా వస్తోంది. కానీ ఎన్టీఆర్ ను పోలిన మనిషంటూ ఎక్కడా ఉండడు .. అసలు అలాంటివాడు మళ్లీ పుట్టడు" అని చెప్పుకొచ్చాడు. స్టేజ్ పై మోకాళ్లపై కూర్చుని ఆయన చేసిన డాన్స్ అందరినీ నవ్వించింది.