ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల

  • వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన యనమల
  • శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా అంటూ సవాల్
  • ఆర్థికశాఖలో ఏం జరుగుతోందో బుగ్గనకు తెలుసా అంటూ ప్రశ్నించిన వైనం
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. ఆర్థికశాఖలో అసలు ఏం జరుగుతోందో మంత్రి బుగ్గనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దేనని యనమల అన్నారు. 

"బహిరంగ మార్కెట్ లో చేసిన అప్పు ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత? పీడీ అకౌంట్ నిధులు ఎన్ని వాడారు, పెండింగ్ బిల్లులు ఎన్ని? ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకివ్వడంలేదు? ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఎందుకు పెరిగాయి? కేంద్రం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చింది, ఎన్ని కోట్లు దారిమళ్లాయి?" అంటూ యనమల ప్రభుత్వాన్ని నిలదీశారు.


More Telugu News