పాకిస్థాన్ లో అక్రమంగా పఠాన్ చిత్ర ప్రదర్శనలు... టికెట్ రేటు రూ.900

  • జనవరి 25న రిలీజైన పఠాన్
  • ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా వసూలు
  • భారత చిత్రాలపై పాక్ లో నిషేధం
  • అయినప్పటికీ కొనసాగుతున్న పఠాన్ చిత్ర ప్రదర్శనలు
  • ప్రతి థియేటర్లోనూ హౌస్ ఫుల్ బోర్డులు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా రాబట్టి, రూ.1000 కోట్ల మార్కు దిశగా దూసుకెళుతోంది. కాగా, భారత చిత్రాలపై పాకిస్థాన్ లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పఠాన్ చిత్రాన్ని పాక్ లో అక్రమంగా ప్రదర్శిస్తున్నారు. 

దాయాది దేశంలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి. టికెట్ రేటు పాకిస్థాన్ కరెన్సీలో రూ.900గా నిర్ణయించినప్పటికీ, జనాలు పోటెత్తుతున్నారట. పఠాన్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండడం పాక్ లోనూ షారుఖ్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


More Telugu News