భార్యపై దాడి చేసిన భారత మాజీ క్రికెటర్​పై కేసు

  • చిక్కుల్లో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి
  • తనను హింసించాడని  భార్య ఆండ్రియా హెవిట్ ఫిర్యాదు
  • ఐపీసీ 324, 504 సెక్షన్ల కింద కాంబ్లిపై ఎఫ్ఐఆర్
తరచూ వివాదాల్లో ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యపై దాడి చేసిన కారణంగా అతనిపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో తనతో గొడవపడి, తలపై బలంగా కొట్టాడని కాంబ్లి భార్య ఆండ్రియా హెవిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బాంద్రాలోని తమ నివాసంలో ఘర్షణ పడ్డ కాంబ్లి కుకింగ్ పాన్ హ్యాండిల్‌ను విసరడంతో తలకు గాయం అయిందని ఆండ్రియా ఫిర్యాదులో పేర్కొంది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరానని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు  ఐపీసీ సెక్షన్ 324 (దాడి), 504 (అవమానించడం) కింద కాంబ్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ కేసులో అతడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.


More Telugu News