బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదం
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం
- ప్రగతి భవన్ లో ముగిసిన సమావేశం
- రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది.
2023-24 బడ్జెట్ లో సంక్షేమానికి నిధులను పెంచుతారా లేదా అన్న చర్చ మొదలైంది. కాగా, ఈ నెల 8న బడ్జెట్ పై సాధారణ చర్చ ఉంటుంది. 9,10,11 తేదీలలో పద్దులపై చర్చ జరగనుంది. ఈ నెల 12న సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. అదే రోజున బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి.