ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • కొన్ని రోజులుగా దూసుకెళ్తున్న ధరల జోరుకు బ్రేక్
  • రూ.700 తగ్గిన పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్
  • 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ. 770 పతనం
కొంతకాలంగా బుల్లెట్ స్పీడుతో దూసుకెళ్లున్న బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్ లో ధరల జోరుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు (తులానికి) రూ.700 మేర తగ్గి రూ.52,400 చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.770కి పడిపోయి 10 గ్రాములకు రూ.57,160 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా పతనమైంది. హైదరాబాద్ లో రూ.1800 పడిపోయి రూ.74,200కు చేరింది. ఢిల్లీలో ఏకంగా రూ.2600 క్షీణించింది.  అక్కడ ప్రస్తుతం రూ.71,200 వద్ద కొనసాగుతోంది. రెండు రోజుల్లోనే రూ.3500 తగ్గింది. 

ప్రస్తుతం విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160 కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రాములు) రూ.52,400గా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160గా ఉంది. హైదరాబాద్‎లో కిలో వెండి ధర రూ.74,200 వద్ద ఉండగా, విశాఖ‎లో కిలో వెండి ధర రూ.74,200గా కొనసాగుతోంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.74,200 లుగా ఉంది.


More Telugu News