మావారు చనిపోయిన దగ్గర నుంచి మెమరీ లాస్ తో బాధపడుతున్నాను: భానుప్రియ
- 80వ దశకంలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ
- ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను బిజీ అయ్యారు
- కొంతకాలం క్రితం భర్తను కోల్పోయిన భానుప్రియ
- ఆరోగ్యం బాాగుండటం లేదని వెల్లడి
- లండన్ లో చదువుకుంటున్న ఆమె కూతురు
భానుప్రియ అనగానే అందమైన ఆమె కళ్లు గుర్తొస్తాయి .. నాట్యంలో కెమెరాకి సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. ఆ మధ్య కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసిన భానుప్రియ ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలలో కనిపించడం లేదు.
తాజా ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ .. "మావారు చనిపోయారు .. అప్పటి నుంచి మెమరీ లాస్ అయ్యాను. డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండటం లేదు. అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను" అన్నారు.
"మావారు చనిపోవడానికి ముందు నేను .. ఆయన విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. ఆయన ఇక్కడికి వస్తుండేవారు .. నేను అక్కడికి వెళుతూ ఉండేదానిని. విడివిడిగా ఉండేవారమనేది పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయి అభినయం లండన్ లో చదువుతోంది. తనకి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదు" అంటూ చెప్పుకొచ్చారు.