మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్

  • ముస్లిం, క్రైస్తవ మతాలపై వ్యాఖ్యలు
  • ఆ రెండు మతాల వారు మతమార్పిళ్ల కోసం కృషి చేస్తుంటారని ఆరోపణ
  • ఐదుసార్లు నమాజ్ చేసి ఏ పాపమైనా చేస్తారని విమర్శలు
  • చర్చిలో కొవ్వొత్తి వెలిగిస్తే పాపం తొలగిపోతుందనుకుంటారని వ్యాఖ్య  
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ముస్లిం, క్రైస్తవ మతాల అజెండా ఒక్కటేనని, ఇతర మతాల వారిని తమ మతంలోకి మార్చాలని వారు ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. యావత్ ప్రపంచాన్ని ఇస్లామీకరణ చేయాలనో, లేక క్రైస్తవంలోకి మళ్లించాలనో వారు ముమ్మరంగా పనిచేస్తుంటారని తెలిపారు. 

ఉగ్రవాద చర్యలకు పాల్పడిన రోజున ఐదుసార్లు నమాజ్ చేస్తారని, దాంతో పాపాలు తొలగిపోతాయనుకుంటారని, క్రైస్తవమతంలో అయితే చర్చిలో కొవ్వొత్తి వెలిగిస్తే చాలు పాపాలు పోతాయని అనుకుంటారని బాబా రాందేవ్ వివరించారు. అయితే హిందూ మతంలో ఇలాంటివేవీ లేవని వెల్లడించారు. 

ముస్లింలు ఐదు సార్లు నమాజ్ చేసి మనసుకు ఏది తోస్తే ఆ పాపం చేస్తుంటారని, వారు హిందూ అమ్మాయిలను ఎత్తుకెళుతుంటారని, ఉగ్రవాదులుగా మారుతుంటారని అన్నారు. వారిలో చాలామంది నేరగాళ్లేనని, ఏదైనా పాపం చేయగానే నమాజ్ చేస్తే సరిపోతుందని ముస్లిం సోదరులకు నేర్పించడం జరిగిందని అన్నారు. 

అదే, హిందూ మతం సనాతన ధర్మాన్ని నేర్పిస్తుందని, యోగా చేయాలని సూచిస్తుందని, హింసకు పాల్పడవద్దని, దైవ ప్రార్థనతో అనేక మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తుందని తెలిపారు.


More Telugu News