రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి గౌరవాన్ని బీజేపీ నేతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు: తెలంగాణ రాష్ట్ర జగదీశ్ రెడ్డి

  • గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారంటున్న బీజేపీ నేతలు
  • వారికి గవర్నరే సమాధానం చెపుతారన్న జగదీశ్ రెడ్డి
  • బీజేపీకి రాజకీయాలు, ఓట్లు మాత్రమే కావాలని మండిపాటు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యంగ వ్యవస్థలను, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని తగ్గించేలా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ తో అబద్ధాలు మాట్లాడించామని బీజేపీ నేతలు చెపుతున్నారని... మరి, ఇన్నాళ్లు గవర్నర్ తో వాళ్లు అబద్ధాలు మాట్లాడించారని తాము భావించాలా? అని ప్రశ్నించారు. 

అసలు గవర్నర్ ప్రసంగాన్ని వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసంగంలో అబద్ధాలు చెప్పారన్న బీజేపీ నేతలకు గవర్నరే సమాధానం చెపుతారని అన్నారు. బీజేపీకి రాజకీయాలు, ఓట్లు మాత్రమే కావాలని... వ్యక్తులు, ప్రజల పట్ల వారికి గౌరవం లేదని మంత్రి విమర్శించారు.


More Telugu News