మీ షాంపూలో సల్ఫేట్స్ ఉన్నాయేమో చూసుకోండి..!
- వీటివల్లే శిరోజాల రంగు మటుమాయం
- తలవెంట్రుకలపై జిడ్డు, మురికి వదిలించేందుకు వాడే కెమికల్స్ ఇవి
- సల్ఫేట్స్ లేని ఇతర షాంపూలను పరిశీలించొచ్చు
భౌతిక అందంలో శిరోజాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆడవారికి అయితే కురులు పంచ ప్రాణాలు. అందుకోసం వారు ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనుకాడరు. నేడు స్త్రీ, పురుషులు ఎదుర్కొంటున్న ఎన్నో రకాల శిరోజాల సమస్యల్లో రంగు కోల్పోవడం ఒకటి. జుట్టు నెరిసిపోవడం, తెల్లగా, బూడిదరంగులోకి మారిపోవడం, కళా విహీనంగా కనిపించడం ఎంతో మందికి అనుభవం.
వెనుకటి తరం వారితో పోలిస్తే నేటి తరం ప్రజలు ప్రధానంగా జుట్టు రాలడం, శిరోజాలు రంగు కోల్పోవడం అనే ముఖ్య సమస్యలను చవిచూస్తున్నారు. దీనికి కారణం షాంపూల్లో వాడే రసాయనాలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షాంపూల్లో ప్రధానంగా సల్ఫేట్స్ ఉంటాయి. సోడియం లారిల్ సల్ఫేట్, సోడియం లారిత్ సల్ఫేట్ అన్నవి షాంపూల్లో ఎక్కువగా వినియోగించే రెండు ప్రధాన సల్ఫేట్స్.
హానికరం
ఈ సల్ఫేట్ ఏజెంట్లను ఇళ్లల్లో వినియోగించే టాయిల్ లెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు, షాంపూల్లో చూడొచ్చు. అంతేకాదు చివరికి టూత్ పేస్ట్ లోనూ సల్ఫేట్స్ ఉంటాయి. వీటి పని ఏమిటంటే.. జిడ్డు, మురికిని తొలగించడం. షాంపూని తలపై వేసి రుద్దినప్పుడు, సబ్బును ఒంటికి పట్టించినప్పుడు నురగ రావడం గమనించే ఉంటారు. అది ఈ సల్ఫేట్ ఏజెంట్ల లేథరింగ్ ప్రభావం వల్లే. షాంపూల్లో, సబ్బుల్లో కేవలం సల్ఫేట్స్ మాత్రమే కాకుండా ఇతర క్లీన్ సర్స్ కూడా ఉంటాయి. కాకపోతే సల్ఫేట్స్ అన్నవి మరింత శుభ్రం చేసే ఏజెంట్లు. వీటిని అనియోనిక్ సర్ఫాక్టెంట్స్ అని కూడా అంటారు. కానీ, నాణేనికి రెండో వైపు తిప్పి చూస్తే.. మన శిరోజాలు రంగును కోల్పోవడానికి ఈ సల్ఫేట్లు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు ప్రధాన సల్ఫేట్లలో సోడియం లారిత్ సల్ఫేట్ కాస్త తక్కువ ప్రభావం చూపిస్తే, సోడియం లారిల్ సల్ఫేట్ మాత్రం చాలా కఠిన ప్రభావాన్ని చూపిస్తుంది.
సహజ పరిష్కారాలు..
వెంట్రుకల కుదుళ్లలో సహజ నూనెలు ఉత్పత్తి అవుతుంటాయి. సల్ఫేట్స్ తో కూడిన షాంపూని వాడడం వల్ల ఈ సహజ నూనెలు మొత్తం పోయి జుట్టు కళావిహీనంగా కనిపిస్తుంది. తల వెంట్రుకలు తగిన తేమతో ఆరోగ్యంగా ఉండేందుకే సహజ నూనెలు విడుదల అవుతుంటాయని తెలుసుకోవాలి. ఈ నూనెల వల్లే కురులు జీవంతో ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సల్ఫేట్స్ లేని షాంపూలు కూడా మార్కెట్లో ఉన్నాయి. వాటిని పరిశీలించొచ్చు. వీటితో తల స్నానం చేసినప్పుడు నురగ పెద్దగా రాదు. నిరుత్సాహపడకుండా వాటిని వాడుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షాంపూ కొనుగోలు చేసే వారు, అందులోని ఇంగ్రేడియంట్స్ జాబితాలో వీట్ ప్రొటీన్, హైడ్రోలైజ్డ్ క్వినోవా, సన్ ఫ్లవర్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్ ఉన్నవి చూసి తీసుకోవచ్చని చెబుతున్నారు.