కష్టకాలం ముగిసింది పాపా... ఊపిరి పీల్చుకో!: సమంత

  • మయోసైటిస్ బారినపడిన సమంత
  • గత కొన్నాళ్లుగా ఇబ్బందిపడిన వైనం
  • ఒప్పుకున్న సినిమాలు ఆలస్యం
  • అనారోగ్యంతో పోరాడుతున్న సమంత
ప్రముఖ నటి సమంత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులే కాక, ఆరోగ్యపరంగానూ తీవ్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి మయోసైటిస్ అనే వ్యాధికి గురయ్యారు. అనారోగ్యంతో ఇటీవల ఆమె కెరీర్ కూడా నిదానించింది. కొన్ని చిత్రాల షూటింగ్ లు ఆలస్యం అయ్యాయి. అయినప్పటికీ, ఒక్కో చిత్రం పూర్తిచేస్తూ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా, స్ఫూర్తిదాయకరీతిలో తనను ఉద్దేశించి తానే ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టు చేశారు. 

"కష్టకాలం ముగిసింది... ఇక ఊపిరి పీల్చుకో పాపా! త్వరలోనే అంతా మామూలుగా అయిపోతుందని హామీ ఇస్తున్నా. ఈ ఏడెనిమిది నెలల్లో ఎంతో బాధాకరమైన పరిస్థితులు చవిచూశావు. వాటిని నువ్వు అధిగమించావన్న విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. మెదడు మొద్దుబారిపోయింది... ఎప్పుడూ ఏదో పరధ్యానం... అయినప్పటికీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు ముందుకెళ్లావు... అదే నువ్వు సాధించిన విజయం. అదెంతో అద్భుతం అనిపిస్తుంది. నీ పట్ల ఎంత గర్విస్తున్నానంటే అంత గర్విస్తున్నాను. నీ పట్ల కూడా నువ్వు గర్వించాలి. నువ్వు చాలా గట్టిదానివి" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News