తెలుగు రాష్ట్రాల రైల్వేలకు బడ్జెట్ లో ఎంత కేటాయించారో చెప్పిన కేంద్రమంత్రి

  • వార్షిక బడ్జెట్ లో రైల్వేశాఖకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు
  • తెలుగు రాష్ట్రాలకు రూ.12,824 కోట్లు
  • ఏపీకి 8,406 కోట్లు కేటాయింపు
  • తెలంగాణకు రూ.4,418 కోట్లు
కేంద్ర వార్షిక బడ్జెట్ లో రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు ఎంత కేటాయింపులు చేశారో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు రూ.12,824 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. బడ్జెట్ లో ఏపీకి రూ.8,406 కోట్లు, తెలంగాణకు రూ.4,418 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 

ఈ నిధులతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని, బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మిస్తారని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. రైల్వే ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సహకరించాలని సూచించారు. 

కాగా, హైస్పీడ్ రైళ్లపై అధ్యయనం చేస్తున్నామని, కాజీపేటలో వ్యాగన్ యూనిట్ కు త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని వెల్లడించారు.


More Telugu News