దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 909 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 243 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతం వరకు లాభపడ్డ టైటాన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ లా దూసుకుపోయాయి. భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. అదానీ గ్రూప్ కు చెందిన స్టాక్స్ కు సంబంధించి కొన్ని సానుకూల సంకేతాలు వెలువడటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. 

ఈ క్రమంలో ఓ దశలో 30 శాతం పతనమైన అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ భారీగా కోలుకుని చివరకు 2 శాతం నష్టాలతో సరిపెట్టుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్కెట్లు భారీగా పెరిగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 909 పాయింట్లు లాభపడి 60,841కి పెరిగింది. నిఫ్టీ 243 పాయింట్లు ఎగబాకి 17,854కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (6.94%), బజాజ్ ఫిన్ సర్వ్ (5.15%), బజాజ్ ఫైనాన్స్ (5.09%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.46%), హెచ్డీఎఫ్సీ (3.15%). 

టాప్ లూజర్స్:
విప్రో (-0.32%), టెక్ మహీంద్రా (-0.22%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.16%).


More Telugu News