ఈ హోటల్ వర్కర్ నైపుణ్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా

  • హోటల్ వెయిటర్ ఒకేసారి 16 దోశల సర్వింగ్
  • అన్నింటినీ ఒకే చేతిపై వరుసగా పేర్చుకున్న వెయిటర్
  • ఈ నైపుణ్యంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ కు అర్హుడేనంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆకర్షణీయమైన వీడియోని తన ట్విట్టర్ ఫాలోవర్ల ముందుకు తీసుకొచ్చారు. ఓ హోటల్ వర్కర్ పనితీరు నైపుణ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. హోటల్లో పెద్ద పెనంపై ఒకేసారి 16 దోశలు వేయగా.. ఆ 16 దోశలను విడిగా ఒక్కో ప్లేట్ లో పెట్టుకుని, ఆ ప్లేట్లు అన్నింటినీ వెయిటర్ తీసుకెళ్లి ఆర్డర్ చేసిన వారికి ఇవ్వడాన్ని గమనించొచ్చు. నిజానికి ఇలాంటి వాటిని ప్రత్యేక నైపుణ్యాలుగానే చూడాలి. 

‘‘మనం వెయిటర్ ఉత్పాదకత రేటును ఒలింపిక్ క్రీడ మాదిరిగా గుర్తించాలి. ఈ విభాగంలో ఈ జెంటిల్ మెన్ నిజంగా బంగారు పతకానికి అర్హుడే’’ అని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఈ వీడియోతోపాటు పోస్ట్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. వెయిటర్ తన చేతినిండా వరుసగా ప్లేట్లను పెట్టుకుని బ్యాలన్స్ గా తీసుకెళ్లడం చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు. మరోపక్క, ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ పోస్ట్ కింద మరో వీడియోని గమనిస్తే.. ఓ బార్ లో మహిళా వెయిటర్ ఒకేసారి భారీ సంఖ్యలో బీర్ల గ్లాసులను తీసుకెళుతూ కనిపిస్తుంది.


More Telugu News