వివేకా హత్య కేసు: సీబీఐ ఎదుట విచారణకు హాజరైన సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
- ఇటీవల వైసీపీ ఎంపీ అవినాశ్ ను విచారించిన వైనం
- అవినాశ్ కాల్ డేటా ఆధారంగా కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు నోటీసులు
- నేడు కడప సెంట్రల్ జైలులో విచారణ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇటీవలే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ అతడి నుంచి సమాచారం సేకరించింది. అవినాశ్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లకు నోటీసులు జారీ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు గత మూడు గంటలుగా ప్రశ్నిస్తున్నారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో నవీన్ కూడా కడప చేరుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి విచారణ ముగిసిన అనంతరం నవీన్ ను ఈ మధ్యాహ్నం విచారించనున్నట్టు తెలుస్తోంది.
వివేకా హత్య అనంతరం అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు కాల్స్ వెళ్లినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్ తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో ఆయన పులివెందుల ఓఎస్డీగా వ్యవహరించారు.