రోటీలు చేసిన బిల్ గేట్స్.. వీడియో ఇదిగో!
- చెఫ్ అవతారమెత్తిన బిల్ గేట్స్
- బ్లాగర్ తో కలిసి ఫుడ్ వీడియో
- తాను వంట చేసి చాలా కాలమైందని వెల్లడి
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త, దాత, రచయిత, ఇన్వెస్టర్ గా ప్రపంచానికి సుపరిచితుడు బిల్ గేట్స్. అమెరికాకు చెందిన ఈ దిగ్గజ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు చెఫ్ అవతారమెత్తారు. అందులోనూ భారతీయ వంటకాన్ని తయారు చేశారు. ఓ ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాప్యులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ తో కలిసి బిల్ గేట్స్ రోటీ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘బిల్ గేట్స్, నేను కలిసి ఇండియన్ రోటీని తయారు చేశాం’’ అని వీడియోలో బెర్నాత్ చెప్పాడు. ‘‘నేను భారతదేశంలోని బీహార్ కు వెళ్లి వచ్చా.. అక్కడ గోధుమలను పండించే రైతులను కలిశాను. రోటీని తయారు చేయడంలో తమ నైపుణ్యాన్ని పంచుకున్న ‘దీదీ కీ రసోయి’ క్యాంటీన్‌లకు ధన్యవాదాలు’’ అని బ్లాగర్ చెప్పుకొచ్చాడు.
వీడియోలో.. గోధుమ పిండి, నీళ్లు, ఉప్పు వేసి మిశ్రమాన్ని బిల్ గేట్స్ కలిపారు. పిండి సిద్ధమయ్యాక.. ఇద్దరూ చపాతీ రోలర్ తో రోటీలు తయారు చేశారు. తాను వంట చేసి చాలా కాలమైందని ఈ సందర్భంగా గేట్స్ చెప్పారు. రోటీ గుండ్రంగా రావాలని బ్లాగర్ చెప్పాడు. కానీ బిల్ గేట్స్ కు మొదటి సారి కదా.. అదో రకంగా వచ్చిందా రోటీ. వాటిని స్టవ్ పై కాల్చి.. నెయ్యి పూశారు. తర్వాత ఇద్దరూ కలిసి వాటిని తిన్నారు. చాలా బాగున్నాయంటూ బిల్ గేట్స్ కితాబునిచ్చారు.
ఈ వీడియోను చూసిన వేలాది మంది ఇండియన్ నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరూ చూసేయండి!