హైదరాబాద్ లో ఫార్ములా ఈరేస్.. కేటీఆర్ కు ఆనంద్ మహీంద్రా థ్యాంక్స్
- ఈ నెల 11న ప్రారంభం కానున్న ఫార్ములా ఈ ప్రిక్స్ పోటీలు
- ఇందులో పాల్గొననున్న మహీంద్రా రేసింగ్ జట్టు
- ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో జరిగే ఫార్ములా ఈ- ప్రిక్స్ రేసింగ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ సైతం పోటీల్లో పాల్గొననుండడం ఆయనలో ఉత్సాహానికి కారణం. ప్రపంచమంతా పోటీ పడి వచ్చిన మహీంద్రా రేసింగ్ జట్టు.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల తాను ఎంతో ఉత్సాహంతో ఉన్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
ఫార్ములా- ఈ రేసింగ్ ని.. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ గా పిలుస్తుంటారు. ఎలక్ట్రిక్ రేసింగ్ కార్ల పోటీ ఇది. ఒకే సీటర్ వాహనాల మధ్య పోటీ ఉంటుంది. ఎఫ్ఐఏ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్డులో గ్రీన్కో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. 11వ తేదీన మొదలు కానున్నాయి. 11 జట్లు ప్రపంచం నలుమూలల నుంచి ఈ పోటీలకు తరలివస్తున్నాయి. ఇప్పటికే రేసింగ్ కోసం ఎలక్ట్రిక్ కార్లను విమానంలో తెప్పించారు. ఎఫ్ఐఏ రేసింగ్ ట్రాక్ ను కూడా తనిఖీ చేసింది.
‘‘ఎనిమిదేళ్ల ప్రపంచవ్యాప్త రేసింగ్ తర్వాత అంతిమంగా మాతృదేశంలో రేసింగ్ లో పాల్గొంటున్నాం. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మొదటిసారి భారత్ కు వస్తోంది. కేటీఆర్ బీఆర్ఎస్ కు, గ్రీన్కోకు ఈ విషయంలో ధన్యవాదాలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.