మరికాసేపట్లో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రెస్‌మీట్
- ఉదయం 10 గంటలకు కోటంరెడ్డి మీడియా సమావేశం
- ఏం మాట్లాడతారన్న విషయంలో ఉత్కంఠ
- రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టిన నేత
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన ఆయన రెండు రోజుల క్రితం ట్యాపింగ్‌కు సంబంధించి ఆరోపణలు బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడతారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
అధికార వైసీపీలో కలకలం రేపిన కోటంరెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితర నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆయన కావాలనే సీఎం జగన్, ఇంటెలిజెన్స్ చీఫ్‌పై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఫోన్‌ను ఎవరూ ట్యాప్ చేయలేదని, అది రికార్డింగ్ మాత్రమేనని అన్నారు. ఈ నేపథ్యంలో వారి విమర్శలను కోటంరెడ్డి నేటి మీడియా సమావేశంలో ఆయన తిప్పికొట్టే అవకాశం ఉంది.