ఆ ముగ్గురితో వైసీపీలో తిరుగుబాటు మొదలైంది: రఘురామకృష్ణరాజు
- ఇన్నాళ్లూ పార్టీలో అవమానాలను దిగమింగుకుని ఉన్నారన్న రఘురామ రాజు
- పార్లమెంటు చట్టం ద్వారానే రాజధాని మార్పు సాధ్యమని కొడాలి గ్రహించారని ఎద్దేవా
- జగన్‌తో స్నేహం తర్వాత అదానీ షేర్లు కుప్పకూలిపోయాయన్న నరసాపురం ఎంపీ
నెల్లూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురి తిరుగుబాటుతో అధికార వైసీపీలో తిరుగుబాటు మొదలైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పార్టీలో అవమానాలను దిగమింగుకుంటూ ఉన్నవాళ్లంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు ప్రారంభమయ్యాయన్నారు. ఢిల్లీలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంతో పార్లమెంటులో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామన్న మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. మొత్తానికి పార్లమెంటు చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమన్న విషయాన్ని ఆయన గుర్తించారని రఘురామరాజు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో స్నేహం తర్వాత అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయని రఘురామరాజు పేర్కొన్నారు.