ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం.. అనంతరం నాందేడ్ కు పయనమవనున్న కేసీఆర్

  • రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
  • రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
  • ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై
ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీ ప్రగతి భవన్ లో జరగనుంది. ఆ రోజున ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనకు బయల్దేరుతారు. 

ఈ నెల 5వ తేదీన నాందేడ్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ సభను నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత తెలంగాణ వెలుపల ఆ పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం గమనార్హం. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రసంగించనున్నారు.


More Telugu News