మూడో టీ20లో యాదవ్ పట్టిన క్యాచ్ లు రెండూ డిటో.. వీడియో ఇదిగో!
- మొదటిసారి అందుకున్న క్యాచ్ కు కాపీ పేస్ట్ లా రెండోది
- స్లిప్స్ లో మెరుపువేగంతో కదిలిన యాదవ్
- హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అదేచోట రెండు క్యాచ్ లు
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుభ్ మన్ గిల్ వీరబాదుడుతో భారత్ స్కోరు 235 పరుగులకు చేరింది. ఈ భారీ టార్గెట్ ను ఛేదించే ప్రయత్నంలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడ్డారు. స్కోరు బోర్డుపైన 7 పరుగులు చేరేసరికే నాలుగు వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. స్లిప్స్ లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో తొలి ఓవర్ లోనే ఫిన్ అలెన్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాతి ఓవర్ లో మరో క్యాచ్ పట్టిన సూర్యకుమార్.. గ్లెన్ ఫిలిప్స్ ను ఔట్ చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ అందుకున్న ఈ రెండు క్యాచ్ లకు చాలా పోలికలు ఉన్నాయి. మొదటిసారి యాదవ్ గాల్లోకి ఎగిరితే కానీ బాల్ చేతికందలేదు. సరిగ్గా రెండోసారి కూడా అదే రిపీట్ అయింది. ఇంకా చెప్పాలంటే.. మొదట అందుకున్న క్యాచ్ కు రెండోసారి అందుకున్నది కాపీ పేస్ట్ లాగే ఉంది. అదే బౌలర్, అదే ఫీల్డర్, అదే చోటు.. బ్యాటర్ మాత్రమే వేరు. దీంతో లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. తొలి నాలుగు ఓవర్లలోనే పాండ్యా, అర్ష్‌దీప్ లు రెండేసి వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ చతికిలపడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా విఫలం కావడంతో 168 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయింది.