లే ఆఫ్‌లకు బదులుగా ఉద్యోగుల వేతనాల్లో కోతకు సిద్ధమైన ‘ఇంటెల్’
- ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తాజా నిర్ణయం
- సంస్థ సీఈవో పాట్ గెల్‌సింగర్ వేతనంలో 25 శాతం కోత
- కింది స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం తగ్గింపు
టెక్ కంపెనీలన్నీ ఎడాపెడా ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న వేళ ‘చిప్’ రారాజు ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది.
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కంపెనీలన్నీ వరుసగా ఉద్యోగులను తొలగిస్తుండగా ఇంటెల్ భిన్నంగా ఆలోచించడాన్ని నిపుణులు కొనియాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనం కొంత తగ్గినా పర్వాలేదు కానీ ఉన్నపళంగా ఉద్యోగం పోతే కష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెల్ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనని చెబుతున్నారు.
కాగా, ఇంటెల్ తాజా నిర్ణయంతో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్‌సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధిస్తారు. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది. సంస్థ భవిష్యత్తుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది.