సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్!

  • 158 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 45 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • రెండున్నర శాతానికి పైగా లాభపడ్డ ఐటీసీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ లాభపడగా... నిఫ్టీ నష్టాలను మూటకట్టుకుంది. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ముగింపు సమయంలో కిందకు జారుకుని ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి వెళ్లింది. కేంద్ర బడ్జెట్ పై ఆశలతో ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. అయితే చివరలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడటంతో లాభాలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 59,708కి పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 17,616కి పడిపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.61%), టాటా స్టీల్ (2.01%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80%), టీసీఎస్ (1.50%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.47%). 
 
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-5.65%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.88%), మహీంద్రా అండ్ మహంద్రా (-1.91%), సన్ ఫార్మా (-1.75%).


More Telugu News