కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు
- ఆర్థికమాంద్యం నేపథ్యంలో జనాకర్షక పథకాల జోలికి పోని కేంద్రం
- కర్ణాటకకు కేంద్ర బడ్జెట్ లో పెద్ద పీట
- అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో ఈరోజు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో ప్రాధాన్యతను ఇచ్చినట్టు ఆమె తెలిపారు. అయితే, ఆర్థికమాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ లో పెద్దగా జనాకర్షక పథకాల జోలికి కేంద్రం పోలేదు.
మరోవైపు, త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో, ఆ రాష్ట్రానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. కర్ణాటకలో వెనుకబడిన, కరవు ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయాన్ని అందిచనున్నట్టు ఆమె ప్రకటించారు. దీంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నిధులను కేటాయించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఏడాది మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.