కేంద్ర వార్షిక బడ్జెట్... హైలెట్స్-2
- ముగిసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
- గంటన్నర పాటు సాగిన బడ్జెట్ ప్రసంగం
- వివిధ రంగాలకు కేటాయింపులు
- పలు స్కీముల ప్రకటనలు చేసిన నిర్మల
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు. బడ్జెట్ పలు రంగాలను స్పృశిస్తూ, కేటాయింపులు, వివిధ స్కీములకు సంబంధించిన వివరాలను చదివి వినిపించారు.
వివరాలు...
వివరాలు...
- మహిళల కోసం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
- రెండేళ్ల కాలవ్యవధితో స్కీమ్
- ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం
- డిపాజిట్ పై 7.5 శాతం సుస్థిర వడ్డీ
- గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం
- సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు
- ప్రస్తుతం 15 లక్షలుగా ఉన్న పరిమితిని ఇకపై రూ.30 లక్షలకు పెంపు
- కర్ణాటకలో వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న ప్రాంతాల సాగు రంగానికి రూ.5,300 కోట్లు
- పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ
- దేశీయ ఉత్పత్తుల విక్రయం కోసం యూనిటీ మాల్స్ ఏర్పాటు
- దేశంలో 50 నూతన విమానాశ్రయాలు, హెలీప్యాడ్ ల ఏర్పాటు
- దేశంలో 50 పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు
- జాతీయ సహకార డేటా బేస్ కు రూ.2,516 కోట్లు
- కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు
- కృత్రిమంగా ల్యాబొరేటరీల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు
- 2030 నాటికి 5 ఎంఎంటీ హైడ్రోజన్ తయారీ... జాతీయ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రూ.19,700 కోట్లు
- లడఖ్ లో రెన్యూవల్ ఎనర్జీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20,700 కోట్లు