కేంద్ర వార్షిక బడ్జెట్... హైలైట్స్-1
- పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
- వివిధ రంగాలకు కేటాయింపులు
- బడ్జెట్ మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడి
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు కేటాయింపులను ప్రకటించారు. 2023-24 వార్షిక బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45.03 లక్షల కోట్లు అని ప్రకటించారు. బడ్జెట్ లో మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడించారు.
- వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు
- శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం
- పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం
- ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత
- గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు
- వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు
- వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు
- రైతుల కోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు
- దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్
- పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు రూ.2 వేల కోట్లు
- ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
- సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు
- నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం
- గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ఏర్పాటు
- రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
- రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు
- రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
- 2013-14తో పోల్చితే రైల్వేలకు 9 రెట్లు అధికంగా నిధులు
- కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
- ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు
- ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
- పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
- 5జీ సేవల యాప్ ల అభివృద్ధి కోసం 100 పరిశోధనా సంస్థలు
- ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు
- ఎంఎస్ఎంఈలు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ
- కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు తక్షణ ప్రాధాన్యత
- కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు
- కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు కూడా సాయం
- నీతి ఆయోగ్ మరో మూడేళ్ల పాటు పొడిగింపు
- పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు