బడ్జెట్ 2023-24... ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం
- వచ్చే ఏడాది ఎన్నికలు
- చివరిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మల
- పార్లమెంటులో కేంద్ర క్యాబినెట్ సమావేశం
- హాజరైన కేంద్రమంత్రులు
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చివరిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ఉదయం 11.00 గంటలకు పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో, కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటులో ఈ సమావేశం జరుగుతోంది. అటు, రాష్ట్రపతితో భేటీ అనంతరం నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటుకు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్ పై సంక్షిప్తంగా చర్చించి ఆమోదం తెలుపనున్నారు.