గతంలో పవన్, అలీ మధ్య ఏం జరిగిందో చెప్పిన నాగబాబు
- గతంలో మంచి స్నేహితులుగా ఉన్న పవన్, అలీ
- తర్వాత కాలంలో ఇద్దరి మధ్య దూరం
- పవన్ పై పోటీ చేసేందుకైనా సిద్ధమంటూ అలీ సంకేతాలు
- అలీ మాటలు సీరియస్ గా తీసుకోలేదన్న నాగబాబు
టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న అగ్రహీరో పవన్ కల్యాణ్, స్టార్ కమెడియన్ అలీ మధ్య రాజకీయాలు దూరం పెంచాయన్నది కాదనలేని నిజం. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో వైసీపీకి ప్రబల ప్రత్యర్థిగా మారగా, అదే వైసీపీలో అలీ ప్రముఖ నేతగా కొనసాగుతున్నాడు. అలీకి ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చి గౌరవించింది. అంతేకాదు, జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేసేందుకైనా సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఆసక్తికర అంశం వెల్లడించారు. గతంలో పవన్, అలీ మధ్య ఏం జరిగిందో చెప్పారు.
"అలీ మాటలను సీరియస్ గా తీసుకోలేదు. అటు పవన్ కల్యాణ్ కూడా అలీని తిట్టింది లేదు. ఎందుకు తిడతాం? కల్యాణ్ బాబు ఏమన్నాడంటే... అలీకి ఎంతో ఉపయోగపడ్డాం కదా... ఇలా వెళ్లిపోతాడనుకోలేదు అన్నాడు. నాకేం ఉపయోగపడ్డాడు అని అలీ అన్నాడు. ఇదే జరిగింది! ఆ తర్వాత అలీ తన కుమార్తె పెళ్లికి పవన్ ను ఆహ్వానించడం జరిగింది. నా ఎదురుగానే పవన్ కు పెళ్లి కార్డు ఇచ్చాడు. అలీ నా దగ్గరకు కూడా వస్తుంటాడు... మేం కలుస్తుంటాం.
అయితే అలీ కుమార్తె పెళ్లి సమయంలో పవన్ మంగళగిరిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఒకసారి పార్టీలోకి వెళ్లిన తర్వాత అధిష్ఠానం ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. అలీ కూడా అంతే. పార్టీ హైకమాండ్ చెబితే పోటీ చేస్తానన్నాడు తప్పితే, ఏదో మనసులో పెట్టుకుని అన్న మాటలు కావు.
గతంతో పోల్చితే పవన్, అలీ మధ్య ఇప్పుడు సఖ్యత కాస్త తక్కువే. ఎవరి జీవితాలు వారివి" అని వివరించారు.