సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా
- అనూహ్యరీతిలో చిక్కుల్లో పడిన ఫుడ్ బ్లాగర్
- ఆన్ లైన్ లో రూ.93 వేలకు సొరచేప కొనుగోలు
- వీడియో వైరల్.. తీవ్రంగా పరిగణించిన చైనా ప్రభుత్వం
చైనాకు చెందిన ఓ మహిళా ఫుడ్ బ్లాగర్ అనూహ్య రీతిలో జరిమానాకు గురైంది. ఆమె చేసిన నేరమల్లా సొరచేపను తినడమే. ఆ బ్లాగర్ పేరు జిన్ మౌమౌ. టిజి అనే పేరుతో సోషల్ మీడియాలో తన ఫుడ్ బ్లాగింగ్ వీడియోలను పంచుకుంటుంది.
ఆమె గతేడాది అలీబాబా ఈ-కామర్స్ సంస్థకు చెందిన టావోబావో ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ద్వారా ఓ తెల్ల సొర చేపను కొనుగోలు చేసింది. ఆ గ్రేట్ వైట్ షార్క్ చేప ఖరీదు రూ.93,295. ఆ బ్లాగర్ ఆరడుగుల ఆ షార్క్ పక్కనే ఫొటోలకు పోజుల్చింది. వీడియో కూడా రూపొందించి టిక్ టాక్ తరహా యాప్ డూయిన్ లో పోస్టు చేసింది.
ఈ వీడియో చైనా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో, ఆ మహిళా బ్లాగర్ చిక్కుల్లో పడింది. ఆ సొరచేపను అంతరించిపోతున్న మత్స్యజాతుల్లో ఒకటిగా గుర్తించారు. దీన్ని వేటాడడం, తినడంపై నిషేధం విధించారు. కాగా, చైనా బ్లాగర్ జిన్ మౌమౌ కొనుగోలు చేసిన సొరచేపకు డీఎన్ఏ పరీక్ష చేయగా, అది గ్రేట్ వైట్ షార్క్ అని తేలింది.
దాంతో జిన్ మౌమౌకు రూ.15 లక్షల జరిమానా వడ్డించారు. అంతేకాదు, ఆ సొరచేపను వేటాడిన మత్స్యకారుడ్ని, ఆ చేపను ఆన్ లైన్ లో మహిళా బ్లాగర్ కు విక్రయించిన వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు.