పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
- చెల్లింపులపై ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్
- ఫిబ్రవరి 2న పెండింగ్ బిల్లులపై సమావేశం
- సీఎఫ్ఎంఎస్ వద్ద రూ.12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడి
- అధికారులు వివరాలు చెప్పడంలేదని సూర్యనారాయణ ఆరోపణ
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మరోసారి గళం వినిపించారు. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలని అన్నారు.
ఫిబ్రవరి 2న పెండింగ్ బిల్లులు-చట్టబద్ధత అంశంపై సమావేశం ఉంటుందని సూర్యనారాయణ వెల్లడించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని సంఘాలతో మాట్లాడుతున్నామని, ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఎఫ్ఎంఎస్ వద్ద రూ.12 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, అధికారులను వివరాలు అడిగితే చెప్పడంలేదని సూర్యనారాయణ ఆరోపించారు.
అటు, గవర్నర్ ను ఉద్యోగ సంఘాలు కలవడంపై ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ నేడు విచారణకు వచ్చింది.