వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్
- తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న కోటంరెడ్డి
- తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం షేక్ అవుతుందని వ్యాఖ్య
- ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయన్న కోటంరెడ్డి
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. వైసీపీ అధిష్ఠానంపై ఆయన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారంటూ ఆయన బహిరంగ విమర్శలు చేశారు. మరోవైపు కోటంరెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్టుగా ఉన్న ఓ ఆడియో లీక్ అయింది. ఈ ఆడియో ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది.
తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని... ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను తాను బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం షేక్ అవుతుందని... కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల మేలు కోసమే తాను పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తన సన్నిహితులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెపుతున్నారు.