రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క
- ఆధ్యాత్మిక యాత్రలో స్టార్ క్రికెటర్ కోహ్లీ
- స్వామీ దయానంద్ గిరి ఆశ్రమ సందర్శన
- ఇటీవల బృందావనంలోనూ పర్యటించిన విరుష్క దంపతులు
ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ కు ముందు.. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాడు. తన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి రిషికేశ్ లో పర్యటిస్తున్నాడు. ఇద్దరూ కలిసి స్వామీ దయానంద్ గిరి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ పూజలు చేశారు. ఆశ్రమంలో కొందరు విరాట్ తో సెల్ఫీలు దిగారు.
స్వామీ దయానంద్ గిరి ఆశ్రమంలో నిర్వహించే ఆచారాల్లో విరుష్క దంపతులు పాల్గొంటారని, ఆపై భండారా (విందు) నిర్వహిస్తారని సమాచారం. ఇటీవల బృందావనంలోని ఆశ్రమానికి విరాట్, అనుష్క దంపతులు తమ బిడ్డ వామికతో కలిసి వెళ్లారు. అక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇక ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ లలో విరాట్ బ్యాటింగ్ కీలకం కానుంది. ఇటీవల ఫామ్ లోకి వచ్చిన అతడు చెలరేగితే.. టీమిండియా గెలుపునకు ఢోకా ఉండదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీగా ఈ సిరీస్ ను పిలుస్తారు. నాలుగు మ్యాచ్ లలో నమోదయ్యే గెలుపోటములు.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాలను నిర్ణయించనున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. జూన్ లో జరిగే టెస్టు చాంపియన్ షిప్ లో పోటీ పడుతాయి.