టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమం: వైద్యులు
- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన అర్జునుడు
- వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామన్న వైద్యులు
- ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న నిపుణుల బృందం
గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన చికిత్స పొందుతున్న విజయవాడలోని రమేశ్ ఆసుపత్రి వైద్యులు గత రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఈ మేరకు పేర్కొన్నారు.
వెంటిలేటర్‌పై ఉంచి లైఫ్ సేవింగ్ సపోర్ట్‌తో అర్జునుడికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ బాబు, అనెస్థీషియా వైద్యుడు డాక్టర్ పి.శ్రీనివాస్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ధరణేంద్ర, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేశ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమారవేలు, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ లక్ష్మీ అనూష పర్యవేక్షణలో అర్జునుడికి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.