ఈసారి మేనేజర్ల వంతు.. వేటుకు సిద్ధమైన జుకర్‌బర్గ్!

  • ఇటీవలే 11 వేల మందిని తొలగించిన మెటా
  • మేనేజర్ల వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి
  • మధ్యస్థాయి మేనేజర్లకు త్వరలోనే పింక్‌ స్లిప్‌లు!
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగులపై మరోమారు లే ఆఫ్ కత్తి వేలాడుతోంది. ఈసారి మేనేజర్ల స్థాయిలో కోత ఉండొచ్చని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హింట్ ఇచ్చారు. సంస్థలోని మేనేజర్ల వ్యవస్థపై జుకర్‌బర్గ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మేనేజర్ల వ్యవస్థపై ఆయన బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తపరచినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యస్థాయి మేనేజర్లపై వేటుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  

మేనేజర్లు, వారిని నియంత్రించేందుకు మరికొంతమంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్ చేసేందుకు ఇంకొంతమంది మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయుల్లో మేనేజ్‌మెంట్ వ్యవస్థ అవసరమని తాను అనుకోవడం లేదని జుకర్‌బర్గ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే వారికి పింక్ స్లిప్‌లు ఖాయమని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మెటా ఇటీవల ఏకంగా 11 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. ఇప్పుడు మేనేజర్లను ఇంటికి పంపాలని యోచిస్తోంది.


More Telugu News