త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు... తానొక్కడే 33 స్థానాల్లో పోటీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
- గతేడాది విశ్వాస పరీక్షలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్
- ప్రధాని పదవి కోల్పోయిన వైనం
- తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించిన ఇమ్రాన్
- రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఉప ఎన్నికలు
రాజకీయ నేతలు ఎన్నికల్లో ఒకేసారి రెండు చోట్ల పోటీచేయడం తెలిసిందే. అయితే, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16న పాకిస్థాన్ లో ఉప ఎన్నికలు జరగనుండగా, తానొక్కడే 33 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు.
పాకిస్థాన్ లో 33 పార్లమెంటరీ స్థానాలకు మరి కొన్నిరోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో గతంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వారే విజయం సాధించారు. గత సంవత్సరం ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో ఓటమి చెందగా, ఆయన తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. ఇప్పుడా రాజీనామాలను పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించడంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
పంజాబ్ ప్రావిన్స్ లో 12 స్థానాలు, సింధ్ ప్రావిన్స్ లో 9, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో 8, ఇస్లామాబాద్ లో 3 స్థానాలు, బలూచిస్థాన్ ప్రావిన్స్ లో 1 స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
దేశంలో ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తున్న ఇమ్రాన్ ఖాన్... ఆ దిశగా ప్రభత్వంపై ఒత్తిడి పెంచేందుకే 33 ఎంపీ స్థానాల్లో తానొక్కడే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పీటీఐ పార్టీ వర్గాలు తెలిపాయి.